ప్రభన్యూస్: చెల్లింపులు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీల నిమిత్తం దేశంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామం వినియోగదారులకు సౌకర్యవంతంగానే ఉన్నా.. మోసగాళ్లను కూడా కొత్త మోసాలవైపు పురిగొల్పుతోంది. ఒరిజినల్ వెబ్‌సైట్ లింక్‌ను పోలిన ఫిషింగ్ లింక్స్, అధికారుల పేరిట విషింగ్ కాల్స్‌తోపాటు సెర్చ్ ఇంజన్లు ఉపయోగించే సమయంలో, క్యూఅర్ స్కాన్‌ల ద్వారా, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా, జూస్ జాకింగ్, ఆన్‌లైన్ జాబుల పేరిట, సిమ్ స్వాప్ లేదా సిమ్ క్లోనింగ్ మోసాల ద్వారా కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బు కొట్టేసేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెచ్చరించింది. మోసాలు జరిగే సమయంపై విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో జరిగిన మోసాల్లో 65-70 శాతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.
ప్రభావిత కస్టమర్లలో 22-50 శాతం వయసున్నవారు 80-85 శాతం ఉన్నారు. మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజెసేందుకు సెంట్రలైజుడ్ హెల్త్‌లైన్ నంబర్ 155260 నంబర్‌ను జూన్ 17, 2021 నుంచి కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సూచించింది. సైబర్ మోసాలను ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని వివరించింది. ఈ హెల్ప్‌లైన్‌లో రాష్ట్రాల పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తారు. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సోషల్ మీడియా, టెక్స్ట్ మెసేజులు, ఈమెయిల్స్, నోటీఫికేషన్ల ద్వారా సెక్యూర్ బ్యాంకింగ్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది. కస్టమర్లను అప్రమ త్తం చేస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital