అంతర్జాతీయ మార్కెట్స్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం ఇన్వెసర్టలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత వారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ చమురు ఇప్పుడు మళ్లిd 110 డాలర్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం అవుతుండటంతో.. చమురు సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే ముడి చమురు ధరలు మళ్లి పెరుగుతున్నాయి.
పలు దేశాలు చమురుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. మరికొన్ని నెలల పాటు యుద్ధం కొనసాగితే.. ముడి చమురు ధరలు మళ్లిd పెరిగే అవకాశాలు లేకపోలేదు. చమురు ధరల పెరుగుదల అనేది.. ద్రవ్యోల్బణ భయాలను పెంచి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..