Friday, November 1, 2024

Railways | రైల్వేల ఆదాయ లక్ష్యం 1.5 లక్షల కోట్లు.. సరకు రవాణా ఆదాయం లక్ష కోట్లు

రైల్వేలు ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆదాయం 6.5 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక ఆదాయంలో 9 శాతం వృద్ధి సాధించాలని రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నందున నిర్ధేశించిన లక్ష్యమైన 9 శాతం వృద్ధిని సాధిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు రైల్వేల సరకు రవాణా ఆదాయం లక్ష కోట్లకు చేరింది.

ఈ ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ 13 నాటికి రైల్వేల ప్యాసింజర్‌ రెవెన్యూ 43,101 కోట్లగా నమోదైంది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లతో రిజర్వ్‌ ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయంలో 7 శాతం పెరిగి 31,875 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ప్రయాణికు సంఖ్య 4.7 శాతం తగ్గి 47.4 కోట్లుగా ఉంది. రైల్వేల్లో అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయంలోనూ 3.8 శాతం పెరుగుదలతో 11,326 కోట్లు వచ్చాయి. ఈ విభాగంలో ప్రయాణికులు 12 శాతం పెరిగారు.

పెరిగిన సరకు రవాణా…

- Advertisement -

ఈ ఆర్ధిక సంవత్సరం ఆక్టోబర్‌ 14 నాటికి సరకు రవాణా 3.7 శాతం పెరిగి 940 మిలియన్‌ టన్నులకు చేరింది. బొగ్గు రవాణా అత్యధిక వాటా కలిగి ఉంది. బొగ్గు రవాణా 3.3 శాతం పెరిగింది. దీని ద్వారా 51,000 కోట్ల ఆదాయం సమకూరింది. లోడింగ్‌ 5.5 శాతం పెరిగి 463 మిలియన్‌ టన్నులకు చేరింది. ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నందున ఈ ఆర్ధిక సంవత్సరం మిగిలిన కాలంలో రైల్వేలు సర కు రవాణాలో వార్షిక లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారు తెలిపారు. ప్యాసింజర్‌ రెవెన్యూలోనూ 1.5 లక్షల కోట్ల ల క్ష్యాన్ని చేరుకుంటామని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement