Saturday, November 23, 2024

య‌ధాస్థితికి రిటైల్‌ రంగం..

దేశంలో రిటైల్ రంగం కోలుకుంటోంది. కరోనా ప్రభావంతో పడిపోయిన రిటైల్‌ రంగం పూర్తిస్థాయి రికవరీకి చేరువలో ఉంది. గత నెలలో 93 శాతానికి చేరుకుంది రిటైల్ రంగం. కోవిడ్ కంటే ముందు ఉన్న స్థాయిలో రిటైల్ రంగం చేరుకుంది. న్సూమర్‌ డ్యూరబుల్స్‌ రంగం 15 శాతం, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్ల విభాగం 18 శాతం వృద్ధిని నమోదు  చేశాయని రిటైలర్ల సంఘం నివేదిక తెలిపింది. పాదరక్షలు, బ్యూటీ, వెల్‌నెస్‌, పర్సనల్‌ కేర్‌, క్రీడా వస్తువులు, ఆహారం, నిత్యావసరాల విభాగాలు క్రమంగా రికవరీ సాధిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రికవరీ నిలకడగా ఉన్నదని, తూర్పు భారతంలో 2 శాతం సానుకూల వృద్ధి నమోదు కాగా దక్షిణాదిలో అమ్మకాల క్షీణత -6 శాతానికి, ఉత్తరాదిలో -.9 శాతానికి తగ్గిందని ఆ నివేదికలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement