Tuesday, November 26, 2024

రెపోరేట్‌ 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం

ఈ నెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపోరేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. దీంతో వడ్డీ రేటు 5.90 శాతానికి చేరుకుంటుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. అంతకు ముందు రోపోరేటును 35 పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్టీ అంచనా వేసింది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం

నిర్ణయిత లక్ష్యం కంటే అధికంగా నమోదైంది. దీంతో వడ్డీ రేట్లు భారీగానే పెంచుతారని అంచనా వేసింది. సెప్టెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం 7.1-7.4 శాతం వరకు ఉండవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఆహార పదార్ధాల ధరలు సెప్టెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగదలకు దోహదం చేస్తాయని తెలిపింది. 2023 ఫిబ్రవరి వరకు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగానే నమోదు అవుతుందని అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement