Wednesday, September 18, 2024

Exports | ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగింపు…

ఉల్లి ఎగుమతులపై కనీస ఎగుమతి నిబంధనను తొలగిస్తున్నట్లు కేంంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు జీడీఎఫ్‌టీ శుక్రవారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లిd ఎన్నికల్లో ఉల్లి రైతుల సమస్యలు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.

దీంతో ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉల్లి ఎగుమతులపై ఉన్న కనీస ధర నిబంధనను ఎత్తివేసింది. 2024 మే నెలలో కేంద్రం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. అయితే కనీస ఎగుమతి ధరగా టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది. ఈ ధరకే వ్యాపారులు ఉల్లిగడ్డలను ఎగుమతి చేయాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది.

ఈ జూన్‌ నెలలో మన దేశం నుంచి ఉల్లిపాయల ఎగుమతులు టన్నుకు కనిష్ట ఎగుమతి ధర 550 డాలర్లతో పాటు 40 శాతం ఎగుమతి సుంకం కలిపితే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల కంటే 50 శాతం కంటే ఎక్కువ ఖరీదైనవిగా మారాయి. 2024 జులై 31 నాటికి మన దేశం నుంచి 2.60 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి.

2023-24 ఆర్ధిక సంవత్సరంలో మన దేశం నుంచి 17.17 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. మహారాష్ట్రలో ఉల్లి పంటను ఎ క్కువగా సాగు చేస్తున్నారు. ఎగుమతులపై ఆంక్షలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగుమతులు పెరిగితే తమకు సరైన ధర వస్తుందని రైతులు భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్‌ ప్రాంతంలో ఉల్లి రైతులు ఆగ్రహం మూలంగానే సరైన ఫలితాలు రాలేదని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కూడా వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికల్లో రైతుల నుంచి ప్రతిఘటన వస్తుందని భావించిన కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement