Friday, November 22, 2024

అబుదాబి కంపెనీతో రిలయన్స్‌ పెట్టుబడులు

ముంబై: అబుదాబి ప్రభుత్వ అధీనంలోని కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ టీఎజిజ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజెక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలసి పనిచేయనున్నాయి. యాఏఈలో పెట్రోకెమికల్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి ఇరుకంపెనీలు సంయుక్తంగా రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం ఎడీఎన్‌ఓసీ ఏర్పరిచిన జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ చేరనుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.

ఈ కొత్త టీఎజడ్‌ఐజీ ఈడీసీ-పీవీసీ జాయింట్‌ వెంచర్‌లో 2బిలియన్ల డాలర్ల పెట్టుబడితో క్లోర్‌ ఆల్కలీ, ఇథిలిన్‌ డైక్లోరైడ్‌, పాలీ వినైల్‌ క్లోరైడ్‌ ఉత్పత్తి చేయనున్నారు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్‌ వెంచర్‌ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ఎడీఎన్‌ఓసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో, యూఏఈ పారిశ్రామిక మంత్రి సుల్తాన్‌ అహ్మద్‌ ఆల్‌ జాబర్‌, రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ భారత్‌, యూఏఈ మధ్య దీర్ఘకాల సంబంధాల బలోపేతానికి ఈ జాయింట్‌ వెంచర్‌ ఉపకరిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement