గత ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోలిస్తే రిలయన్స్ జియో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గణనీయ స్థాయిలో రూ.4,335 కోట్ల మేర లాభాలు ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.3,501 కోట్లు లాభాలు రాగా ఇప్పుడు 23.82 శాతం అధికంగా లభాలు వచ్చాయని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో లాభాల బాటలోనే వెడుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.3,651 మేర లాభాలు ఆర్జించింది.
అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 45 శాతం అధికంగా లాభాలు వచ్చాయన్నమాట. మొన్న మార్చితో ముగిసిన ఆర్థికసంవత్సరంలో రిలయన్స్ జియో 23 శాతం అధికంగా లాభాలు ఆర్జించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 12,071 కోట్లు ఆదాయం రాగా 2022లో 14,854 కోట్లు వచ్చింది.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.