రిలయన్స్ జియో శుక్రవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2022, మార్చి 31 నాటికి నికర లాభం 24 శాతం పెరిగి.. రూ.4173 కోట్ల లాభాలు పొందినట్టు కంపెనీ వివరించింది. కంపెనీ ఒక సంవత్సరం క్రితం నాల్గో త్రైమాసికంలో రూ.3360 కోట్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (ప్యాట్) నమోదు చేసిందని కంపెనీ తన ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. రెవెన్యూ పరంగా చూసుకుంటే.. 20 శాతం పెరిగి.. రూ.20,901 కోట్లకు చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ.17,358 కోట్లు నమోదు చేసుకుంది. 2022, మార్చి 31 నాటికి మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను రిలయన్స్ జియో ప్యాట్ 23 శాతం పెరిగి.. రూ.14,854 కోట్లకు చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.12,071 కోట్లుగా నమోదైంది. వార్షిక ఆదాయం పరంగా చూసుకుంటే.. 2021-22లో 10.3 శాతం వృద్ధితో రూ.77,356 కోట్లకు చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.70,127 కోట్లుగా నమోదైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..