Tuesday, November 26, 2024

Followup: 2023 నాటికి అన్ని గ్రామాలకు 5జీ.. ప్రకటించిన రిలయన్స్‌ జియో

ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ లో కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఈ సేవలను తీసుకువస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని, టెలికం రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖేష్‌ అంబానీ చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెనస్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చెయిన్‌ మెటావర్స్‌ వంటి 21వ శతాబ్దపు సాంకేతికతకు ఇదే పునాది కానుందని చెప్పారు.

2024 నాటికి దేశమంతా ఎయిర్‌టెల్‌

సమావేశంలో పాల్గొన్న భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునిల్‌ మిత్తల్‌ మాట్లడుతూ తొలుత నాలుగు మెట్రో నగరాలతో పాటు 8 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దశల వారికి ఈ సేవలను విస్తరిస్తూ 2024 మార్చి నాటికి దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. వోడాఫోన్‌ ఐడియా కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా సమావేశంలో మట్లాడుతూ త్వరలోనే 5జీ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు

- Advertisement -

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ప్రారంభిస్తుందని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రవేట్‌ టెలికం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థల అధిపతులు తమ 5జీ ప్రణాళికలు వివరించారు. ఈ సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిస్థతి ఏంటన్న ప్రశ్న వచ్చింది. దీనిపై విలేకరులకు వివరణ ఇచ్చిన టెలికం శాఖ మంత్రి స్పష్టత ఇచ్చారు. రానున్న ఆరు నెలల్లో దేశంలోని 200కు పైగా నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం zవుతాయని మంత్రి చెప్పారు. రెండేళ్లలో దేశంలో 80-90 శాతం ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ప్రారంభం అవుతాయని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలో అన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను అందించే స్థితిలోలేదు. ఈ సర్వీస్‌లను విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. 5జీ సేవలు అందుకోవాలంటే సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరంలేదని టెలికం నిపుణులు చెబుతున్నారు. 5జీ నెట్‌వర్‌ ్కను సపోర్టు చేసే ఫోన్‌ ఉంటే సరిపోతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement