Friday, November 22, 2024

సెన్స్‌హాక్‌లో 79 శాతం వాటా కొనుగోలు చేసిన రిలయన్స్‌

అమెరికాకు చెందిన సౌరశక్తి ఉత్పత్తి సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 79.4 శాతం వాటా కొనుగోలు చేసింది. నూతన ఇంధన రంగంలోకి విస్తరిస్తున్న రిలయన్స్‌ ఈ దిశగా వ్యాపారాన్ని విస్తృతం చేసే పనిలో ఉంది. అమెరికాకు చెందిన సెన్స్‌హాక్‌ అనే కంపెనీలు ఈ వాటాలను కొనుగోలు చేసింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. సోలార్‌ ప్రాజెక్ట్‌ల ప్రణాళిక దశ నుంచి ఉత్పత్తి స్థాయి వరకు ఉండే ప్రక్రియను వేగవంతం చేయడంలో ఇది తోడ్పాటు అందిస్తోంది. సౌరశక్తి సంబంధించిన ఆస్తుల నిర్వహణ సేవలనూ సెన్స్‌మాక్‌ అందిస్తోంది. నియంత్రణాపరమైన అనుమతులు అభిస్తే ఈ సంవత్సరం చివరి నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందిని రిలయన్స్‌ తెలిపింది.

సెన్స్‌హాక్‌ సహకారంతో సౌరశక్తి ఉత్పత్తి ఖర్చు తగ్గించి, ఉత్పాదకతను పెంచుతామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ,ఎండీ ముఖేష్‌ అంబానీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో సౌరశక్తి ఉత్పత్తి చేసేలా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. అందరికి అందుబాటులో ఉండే విద్యుత్‌ వనరుగా సౌరశక్తిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జామ్‌నగర్‌లో పూర్తి అనుసంధానితత నూతన ఇంధన ఉత్పత్తి వనరుల్ని అభివృద్ధి చేస్తోందని దీని కోసం 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఫోటోవోల్టాక్‌ ప్యానెల్‌, ఎనర్జీ స్టోరేజీ, హరిత ఉదజని, ఫ్యూయల్‌ సెల్‌ వ్యవస్థల కోసం రిలయన్స్‌ నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించనుంది. పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కోసం కూడా ఒక గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రిలయన్స్‌ ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement