హైదరాబాద్ : శాస్తీయ డేటా ఆధారిత పద్ధతి ద్వారా ఆన్‌లైన్ గేమ్‌లను నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించడానికి భారతదేశం మొట్టమొదటి సమగ్ర విధానం, ది స్కిల్ గేమ్స్ ఫ్రేమ్‌వర్క్ ను అనుమతించదగిన ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్‌లను కనుగొనటానికి ఒక ఆబ్జెక్టివ్ ఫ్రేమ్‌వర్క్ గా విడుదల చేయబడినది. ప్రఖ్యాత గణాంక నిపుణుడు పద్మశ్రీ ప్రొఫెసర్ (డా.) బిమల్ రాయ్, ది డైలాగ్ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇది దేశంలో విజృంభిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్‌ను నియంత్రించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
ఫ్రేమ్‌వర్క్ విడుదలపై ప్రొఫెసర్ రాయ్ మాట్లాడుతూ… వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో నియంత్రణ స్పష్టత చాలా ముఖ్యమైనదన్నారు. ఫ్రేమ్‌వర్క్ నేటి సవాళ్లకు పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశంలో గేమింగ్ నియంత్రణ భవిష్యత్తుకు పునాదిని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం వాటాదారులకు- ప్లేయర్‌లు, రెగ్యులేటర్‌లు, డెవలపర్‌లు – న్యాయమైన, నియంత్రిత వాతావరణంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే విశ్వాసాన్ని అందిస్తుందన్నారు.
భారతదేశం టెక్ పాలసీ ల్యాండ్‌స్కేప్‌లో ప్రముఖ స్వరం అయిన ది డైలాగ్ వ్యవస్థాపక డైరెక్టర్ కాజిమ్ రిజ్వీ మాట్లాడుతూ… ఫ్రేమ్‌వర్క్ ప్రారంభం భారతదేశం ఆన్‌లైన్ గేమింగ్ ల్యాండ్‌స్కేప్‌కు ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందన్నారు. ఇది నైపుణ్యం గేమ్‌లను అనుభవపూర్వకంగా వర్గీకరించడానికి ఒక పద్ధతిని అందిస్తుందన్నారు. డెవలపర్‌లకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. అనంతరం ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడడంలో సహాయ పడుతుందన్నారు.
ది డైలాగ్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ కృతి సింగ్ మాట్లాడుతూ… తమ ఫ్రేమ్‌వర్క్‌కు మూడు కీలక లక్ష్యాలు ఉన్నాయన్నారు. ముందుగా, ఇది నైపుణ్యం, అవకాశాల ఆటల మధ్య తేడాను గుర్తించడానికి పరిమాణాత్మక పద్ధతిని అందిస్తుందన్నారు. రెండవది చట్టబద్ధమైన ప్లాట్‌ఫారమ్‌లను చట్టవిరుద్ధమైన వాటి నుండి వేరు చేయడానికి ఇది ఒక సాధనంగా పనిచేస్తుందన్నారు. మూడవది, ఈ రంగంలో విశ్వసనీయతను పెంపొందించడం ద్వారా విస్తృతంగా అవలంబించగలిగే పరిశ్రమ ప్రమాణాన్ని నెలకొల్పడం దీని లక్ష్యమని వివరించారు.