Thursday, November 21, 2024

Exports | ఉల్లి ఎగుమతుల నిషేధంపై సడలింపు..

ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి విదేశీ ఎగుమతులపై గత ఏడాది డిసెంబరు 8 నుంచి అమల్లో ఉన్న నిషేధాన్ని కొంత మేరకు సడలించింది. ఈనెల 31 వరకు బంగ్లాదేశ్‌, మారిషస్‌, బహ్రెయిన్‌, భూటాన్‌ లకు 54,760 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతినిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహరాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

బంగ్లాదేశ్‌ కు 50 వేల టన్నులు, మారిషస్‌ కు 1200 టన్నులు, బహ్రెయిన్‌ కు 3 వేల టన్నులు, భూటాన్‌ కు 560 టన్నులను మార్చి 31 లోపు మాత్రమే ఎగుమతి చేయాలని నిబంధనలు విధించారు. దేశంగా ఉల్లి డిమాండ్‌-సప్లయ్‌ ల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31 విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ గత ఏడాది డిసెంబరు 8న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఉల్లి ధరలు అదుపులో ఉండటంతో పాటు దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండటంతో కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి మేరకు ఉల్లిపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా సడలించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement