మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య దేశీయ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి పెద్ద ప్రోత్సాహం కానుంది. ఈ సుంకాలను ప్రత్యేకంగా బ్యాటరీ కవర్స్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్స్, ప్లాస్టిక్, మెటలో చేసిన ఇతర మెకానికల్ ఐటమ్స్‌పై ఈ సుంకాలను తగ్గించారు. ఈ చర్యపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది.
దేశీయంగా ఈ కంపోనెంట్స్ తయారీని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ చర్య దెబ్బతీస్తుందని కొంత మంది పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో తయారువుతున్న స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్న 80-90 శాతం వరకు పరికరాలు దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. సుంకాలు తగ్గించడం వల్ల స్మార్ట్‌ఫోన్లను మన దేశంలో అసెంబుల్ చేసే సంస్థలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్న కంపెనీలు అత్యధికంగా చైనా నుంచి ఈ కంపోనెంట్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం తొలుత కంపోనెంట్స్ దిగుమతిపై సుంకాలు పెంచిందని, ఇక్కడ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మనుఫ్యాక్చరర్స్ కోసం తాజాగా కొన్ని ప్రధానమైన కాంపోనెంట్స్‌పై దిగుమతి సుంకాలు తగ్గించినట్లు పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా సుంకాలు తగ్గించడం వల్ల భారత్‌లో తయారీ ఫోన్ల ధరలు తగ్గుతాయని, దీని వల్ల అమ్మకాలు పెరిగడంతో పాటు, ఎగుమతులు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.