Monday, November 18, 2024

తగ్గిన ఓలా క్రేజ్‌.. అగ్రస్థానానికి హీరో ఎలక్ట్రిక్‌

ప్రారంభంలో అమ్మకాల్లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్‌ క్రేజ్‌ తగ్గిపోతున్నది. ఓలా విక్రయాలు మరోసారి క్షిణించాయి. జూన్‌లో 5,874 వాహనాలు విక్రయించిన ఓలా, జూలైలో కేవలం 3,426 వాహనాలను మాత్రమే విక్రయించింది. జూన్‌ అమ్మకాలతో పోల్చితే జులైలో 42 శాతం తగ్గాయి. మరో టూ వీలర్‌ ఎలక్ట్రికల్‌ వాహన సంస్థ ఒకినావా ఇప్పటి వరకు విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది. జులై నెలలో ఒకినావా దూకుడుకు హీరో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు అధికమించాయి. అమ్మకాల్లో హీరో అగ్రస్థానానికి చేరింది. వాహన విక్రయాల వివరాలను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 12,691 వాహనాలను విక్రయించిన ఓలా అగ్రస్థానంలో నిలిచింది. మే నెల నుంచి ఓలా అమ్మకాలు క్షిణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మకాల్లో ఓలా నాలుగో స్థానంలో ఉంది. హీరో ఎలక్ట్రిక్‌ జులైలో 8,679 వాహనాల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. జూన్‌ నెలతో పోల్చితే అమ్మకాలు 14.5 వాతం పెరిగాయి. ఒకినావా ఆటో టెక్‌ 7,999 వాహనాల విక్రయించి రెండో స్థానంలో వుంది. 6,106 వాహనాల విక్రయాలతో యాంపియర్‌ మూడో స్థానంలో ఉంది. హీరో మోటొకార్ప్‌కు చెందిన ఏథర్‌ ఎనర్జీ అమ్మకాలు 68.6 శాతం పెరిగాయి. ఏథర్‌ 1192 వాహనాలను విక్రయించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement