ఇరాన్ భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లి ఆంక్షలు విధించడంతో భారత్, టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది. (రూపాయి-రియాల్)లోనే డీల్ చేయడంతో.. మధ్యవర్తిత్వ వ్యయాలు తగ్గుతాయి. ఇరాన్‌కు ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలతో 80శాతం దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్డర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి.
ఆ నిధులను టెహ్రాన్ భారత్ నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల నుంచి దాదాపు రూ.1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో రూ.200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..