Sunday, November 24, 2024

Sales | తగ్గిన ఇళ్ల అమ్మకాలు..

దేశంలో గృహ విక్రయాలు తగ్గాయి. ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే 8 శాతం తగ్గాయి. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదత నమోదు కావడం రెండేళ్లలో ఇదే తొలిసారని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్‌ తెలిపింది. ఈ సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో 1,30,370 ఇళ్ల అమ్మకాలు జరిగితే, రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య 1,20,340కి తగ్గిందని ఈ నివేదిక తెలిపింది.

2022లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 15 శాతం మేర అమ్మకాలు క్షీణించాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 99,550 ఇళ్ల విక్రయాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో 84,925 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంలో అధిక విక్రయాలు నమోదుకావడం, ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ లో విక్రయాలు తగ్గడడానికి కారణమని అన్‌రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురీ తెలిపారు. గత సంత్సరం ప్రాపర్టీ ధరలు భారీగా పెరగడం కూడా కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఇళ్ల ధరలు 7 శాతం మేర పెరిగాయని అన్‌రాక్‌ తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగుదల 25 శాతంగా ఉందని తెలిపింది. గత త్రైమాసికంలో పోలిస్తే, దేశ రాజధాని ప్రాంతంలో 10 శాతం పెరిగితే, హైదరాబాద్‌లో 9 శాతం, బెంగళూర్‌లో 8 శాతం ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మాత్రం అమ్మకాలు 6 శాతం పెరిగాయి. ముంబై, బెంగళూర్‌, పుణే, హైదరాబాద్‌, చెన్నయ్‌, కోల్‌కతా నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో క్షీణత నమోదైందని ఈ నివేదిక తెలిపింది. గత సంతవ్సరంతో పోల్చితే హైదరాబాద్‌లో 11 శాతం, ముంబై, బెంగళూర్‌లో 9 శాతం, చెన్నయ్‌లో 9 శాతం కోల్‌కతాలో 20 శాతం అమ్మకాల్లో క్షీణత నమోదైందని అన్‌రాక్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement