Friday, November 22, 2024

తగ్గిన నగదు చెలామణీ.. 20 ఏళ్లలో ఇదే ఫ‌స్ట్ టైమ్‌, నివేదిక‌లో వెల్లడించిన ఎస్‌బీఐ

దీపావళి పండుగ జరిగిన వారంలో దేశంలో నగదు చెలామణీ గణనీయంగా తగ్గింది. 20 సంవత్సరాల్లో ఇలా తగ్గడం ఇదే మొదటిసారని ఎస్‌బీఐ నివేదికలో పేర్కొంది. ఆ వారంలో నగదు చెలామణీ 7,600 కోట్ల వరకు తగ్గిందని ఎస్‌బీఐ వివేదిక వెల్లడించింది. ప్రజలు ఎక్కువగా డిజిటల్‌ చెల్లింపులపై ఆధారపడటం పెరగడం మే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు ఎస్‌బీఐ ఆర్దిక వేత్తలు అభిప్రాయపడ్డారు. 2009లో దీపావళి వారంలో కూడా నగదు చెలామణీ స్వల్పంగా 950 కోట్లు తగ్గిందని నివేదిక తెలిపింది.

అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న మాంధ్యమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా భారత్‌ నగదు ఆధారిత ఆర్ధిక వ్యవస్థ స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత చెల్లింపులకు మారిందని ఆ నివేదిక పేర్కొంది. నగదు చెలామణీ తగ్గడం ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు నిల్వల నిష్పత్తి కూడా తగ్గుతుందని, ఫలితంగా డిపాజిట్‌ల క్షీణత ఆగి, నగదు లభ్యతపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటలీకరణ చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తుందని తెలిపింది. యూపీఐ, వాలెట్లు, పీపీఐలు నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేశాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement