Saturday, November 23, 2024

వాణిజ్య సిలిండర్‌పై తగ్గిన భారం.. 91.50 తగ్గించిన కంపెనీలు

ఆయిల్‌ కంపెనీలు వాణిజ్య సిలిండర్‌ ధరను 91.50 రుపాయలకు తగ్గించాయి. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లిలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధరను 91.50 రూపాయలు తగ్గించడంతో అది 2,028గా ఉంది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులేదు.

పెట్రోలియం, గ్యాస్‌ కంపెనీలు ఈ సంవత్సరం మార్చి 1న వాణిజ్య సిలిండర్‌ ధరను 350.50 రూపాయలు, గృహ వినియోగ సిలిండర్‌ ధరను 50 రూపాయలు పెంచాయి. అంతకు ముందు జనవరిలోనూ వాణిజ్య సిలిండర్‌ ధరను 25 రూపాయిలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement