Tuesday, November 26, 2024

Jobs | తయారీ, ఈవీ, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెరగనున్న నియామకాలు

దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్యుత్‌ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. విద్యుత్‌ వాహన రంగంలో అనేక కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ కంపెనీలు పెరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలు, సంస్థల ఆఫ్‌షోర్‌ సదుపాయలు దేశంలో పెెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. వీటి కార్యకలాపాలు పెరుగుతున్నందున 2024లో ఈ రంగాల్లో ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఒక నివేదిక అంచనా వేసింది. గడిచిన ఐదు సంవత్సరాలతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్‌మెంట్లు పెరగనున్నాయి.

ఐటీ రంగంలో నిపుణులకు డిమాండ్‌ గణనీయంగా తగ్గిపోయింది. మూడు సంవత్సరాలుగా కంపెనీలు లక్షల సంఖ్యలో ఐటీ రంగంలో ఉద్యోగులను తొలగించాయి. కొత్తగా రిక్రూట్‌మెంట్లను ప్రారంభించడంలేదు. 2023లో రిక్రూట్‌మెంట్‌ 16 శాతంగా ఉంటే, 2024లో ఇది 19.8 శాతం ఉంటుందని అడెక్కో అనే హెచ్‌ సొల్యూషన్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 2020 తరువాత ఇదే అత్యధికమని తెలిపింది. ఈ సంస్థ మొత్తం 500 కంపెనీలపై సర్వే చేసింది. ఈ కంపెనీల్లో 50 కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో లిస్టయినవి ఉన్నాయి.

మిగిలినవి స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి ఉన్నాయి. సర్వే చేసిన 500 కంపెనీల్లో ఎక్కువ వాటిలో 2,500 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, వివిధ డొమైన్‌లలో నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం డిమాండ్‌ పెరగడం, మరో వైపు పశ్చిమ దేశాల్లో లేబర్‌ మార్కెట్ల డిమాండ్‌ తగ్గడం మన దేశానికి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు దోహదం చేస్తుదని అడెక్కో ఇండియా డైరెక్టర్‌, రిక్రూట్‌మెంట్‌ హెడ్‌ కార్తికేయన్‌ కేశవన్‌ చెప్పారు. అడెక్కో వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో కోటి మంది వరకు ఉద్యోగాలు మారడం, లేదా కొత్త ఉద్యోగాల్లోకి వెళ్లడం జరిగిందని తెలిపింది.

ఈ రంగాల్లో ఎక్కువ రిక్రూట్‌మెంట్‌…

ఇంజినీరింగ్‌ సెక్టర్‌లో ఉన్న ఆటోమొబైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, కెమికల్‌, అగ్రికల్చర్‌, ప్రాసెస్సెడ్‌ ఫుడ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రీయల్‌ ఇంజినీరింగ్‌, విద్యుత్‌ వాహనాల రంగం రంగాల్లో 2024లో రిక్రూటెమెంట్‌ 25-30 శాతం వరకు ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. వీటికి అదనంగా ఉద్యోగాలు మారే వారే వారు కూడా 15 నుంచి 40 శాతం వరకు ఉంటారని తెలిపింది. ఈ ధోరణి ప్రధానంగా ఈవీ, ఇంజినీరింగ్‌ రంగాల్లో డబుల్‌ డిజిట్‌ వేతనం ఆఫర్‌తో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 2024లో వేగంగా అభివృద్ధి చెందుతున్న జాబ్‌ మార్‌ట్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు నేర్చుకునే మనస్థత్వాన్ని కలిగి ఉండాలని నివేదిక సూచించింది.

- Advertisement -

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), డిజిటల్‌ టెక్నాలజీ రంగాల్లోని కంపెనీలు 2024లో 8 నుంచి 12 శాతం వరకు వేతనాలు పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. వీరితో పాటు ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, మనవవనరులు, లీగల్‌, నియంత్రణ విభాగాలు, సేల్స్‌, మార్కెటింగ్‌ రంగాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో కన్సల్టెంట్స్‌కు డిమాండ్‌ పెరగనుంది.

ఇంటిలిజెన్స్‌, ఆటోమేషన్‌, విద్యుత్‌ వాహనాల రంగంలో బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రైన్స్‌, వెహికల్‌ డిజైన్‌ విభాగాల్లో ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2024లో ఉద్యోగుల వేతనాలు డబుల్‌ డిజిట్‌ వరకు పెంచనున్నట్లు సర్వేలో పాల్గొన్న వాటిలో 46 శాతం సంస్థలు, కంపెనీలు తెలిపాయి. ఉద్యోగాలు మారినప్పుడు జీతం పెరుగుతుందని, ఇది సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం సగటు జీతం పెరుగుదల కంటే ఎ క్కువగా ఉంటుందిని ఈ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement