Friday, November 22, 2024

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఆదాయం..

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, అన్ని పన్నుల ఆదాయం 60.92 శాతం పెరిగింది. 2021-22లో రవాణా శాఖ ఆదాయం రూ.3,971.38 కోట్లుగా ఉండగా, మార్చి 31తో ముగిసిన 2022-23 సంవత్సరానికి రూ.6,390.80 కోట్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

గ్రీన్ ట్యాక్స్ ఆదాయం రికార్డు స్థాయిలో 1,067.41 శాతం వృద్ధిని సాధించిందని అధికారి తెలిపారు. మొత్తం ఆదాయంలో జీవిత పన్ను రూ.4,670.04 కోట్లు, త్రైమాసిక పన్ను రూ.779.09 కోట్లు, వివిధ రకాల ఫీజులు రూ.552.53 కోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement