దేశీయ పౌర విమానయాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న ఒక్క రోజులో 5,05,412 మంది విమానాల్లో ప్రయాణించారు. ఒకే రోజులో ఈ స్థాయిలో ప్రయాణికుల సంఖ్య నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. తొలిసారి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటింది.
ఈ నెల 8వ తేదీన 4,90,000 మంది, 9వ తేదీన 4,96,000 మంది, 14వ తేదీన 4,97,000 మంది, 15వ తేదీన 4,99,000 మంది, 16వ తేదీన 4,98,000 మంది విమానాల్లో ప్రయాణించగా… 17వ తేదీన మొదటిసారి 5 లక్షలకు పైగా విమానాల్లో ప్రయాణించారు. ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి పండగలు, వివాహ వేడుకలు కారణమని విమానయాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.