హైదరాబాద్, (ప్రభ న్యూస్) : అంతర్జాతీయంగా లాభాపేక్షలేని జర్నలిజం సంస్థ రెస్ట్ ఆఫ్ వరల్డ్ (ఆర్ఓ డబ్ల్యూ) ద్వారా కూ సహవ్యవస్థా పకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఈసందర్భంగా కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… రెస్ట్ ఆఫ్ వరల్డ్ 100: గ్లోబల్ టెక్ చేంజ్ మేకర్స్ లో గుర్తింపు పొందడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. విశేషమైన అనుభూతిని పొందుతున్నామన్నారు. ఇందులో ప్రపంచంలోని అత్యంత గొప్ప పారిశ్రామికవేత్తలు, దార్శనికులు వారి వారి ప్రత్యేకతల ద్వారా లక్షలాది మంది జీవితాలను తీర్చిదిద్దుతున్నారన్నారు.
రెస్ట్ ఆఫ్ వరల్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థచే గుర్తింపు పొందడం నిజంగా తమకు గౌరవమన్నారు. తాము భాష ఆధారిత మైక్రో-బ్లాగింగ్ను కనుగొన్నామని, ఉన్నతమైన, లీనమయ్యే వివిధ భాషా అనుభవాన్ని అందించే పరిష్కారాన్ని రూపొందించామన్నారు. ప్రపంచంలోని 80శాతం మంది ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడతారు.. కాబట్టి స్థానిక భాషల్లో స్వీయ వ్యక్తీకరణ అవసరం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఓ సవాలు అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..