Monday, November 18, 2024

Realme 12 Pro | లాంచ్‌కు రెడీగా రియల్‌మీ 12 సిరీస్ పోన్లు.. ధర, ఫీచర్లు ఇవే !

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ భారత మార్కెట్‌లో కొత్త మొడల్‌ని తీసుకురానుంది. భారతీయ మార్కెట్‌లో మిడ్‌రేంజ్ స్మార్‌‌ట్‌ఫోన్‌లకి పెరగుతున్న డిమాండ్ కారణంగా.. రూ.25వేల నుంచి రూ.30వేల రేంజ్‌లో రియల్‌మీ 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 12 ప్రో, 12 ప్రో ప్లస్ ఫోన్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి.

రియల్‌మీ 12 ప్రో ఫోన్ RMX3842, రియల్‌మీ 12 ప్రో ప్లస్ ఫోన్ RMX3840 మోడల్ నంబర్లతో డిసెంబర్ 8న BIS సర్టిఫికేషన్ పొందాయి. ఇదే మోడల్ నంబర్‌తో రియల్‌మీ 12 ప్రో ప్లస్ ఎడిషన్ ఇండోనేషియాలో SDPPI సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా కనిపించింది. దీంతో త్వరలో ఇవి గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీఐఎస్ సర్టిఫికేషన్ తప్ప, కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర, ఫీచర్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.

- Advertisement -

ధర ఎంత ఉండవచ్చు..

రియల్‌మీ 12 ప్రో 12GB RAM/256GB స్టోరేజ్‌ మోడల్ ధర దాదాపు రూ.25,000 ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్లస్ ఎడిషన్ ధర మరింత ఎక్కువగా ఉండవచ్చు. చైనాలో లాంచ్ అయిన తర్వాత, ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు భారతదేశంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

రియల్‌మీ 12 ప్రో ఫీచర్లు

అయితే రియల్‌మీ 12 ప్రో ఫోన్‌, 2x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ ఉన్న 32MP IMX709 టెలిఫోటో లెన్స్‌తో రావచ్చు. అయితే ప్రీమియం రియల్‌మీ 12 ప్రో ప్లస్ మాత్రం, 3x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ ఉన్న 64 MP ఓమ్నివిజన్ OV64B లెన్స్‌తో రావచ్చు. ఈ సిరీస్ ఫోన్లు రెండూ డ్యుయల్ కెమెరా సెటప్‌తో, వెనుక వైపు సర్క్యులర్ కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంటాయని 91మొబైల్స్ సైట్ పేర్కొంది. నివేదికల ప్రకారం.. రియల్‌మీ 12 ప్రో ఫోన్ 4nm ప్రాసెస్ ఉన్న క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను చేసే Adreno GPUతో ప్రాసెసర్ పెయిర్ అవుతుంది. ఈ కెపాసిటీతో ఫోన్ ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement