Wednesday, November 20, 2024

ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధం.. ఫ్యూచర్‌ గ్రూప్‌ డైరెక్టర్లకు అమెజాన్‌ లేఖ

ఫ్యూచర్‌ గ్రూపు లిమిటెడ్‌ ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు గ్రూపు స్వతంత్ర డైరెక్టర్లకు అమెరికా ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ లేఖ రాసింది. స్వతంత్ర డైరెక్టర్లు గగన్‌ సింగ్‌, రవీంద్ర ధరివాల్‌, జాకబ్‌ మాథ్యూలకు లేఖ రాసింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సాయం చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేసింది. సమర క్యాపిటల్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ మధ్య టర్మ్‌షీట్‌ కొనసాగింపుగా ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడికైనా సిద్ధమేనని అమెజాన్‌ పేర్కొంది. సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి, సీసీఐ చైర్మన్‌ అశోక్‌ గుప్తా, ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా, సెబీ జీవితకాల మెంబర్‌ జీ మహలింగంలకు కూడా అమెజాన్‌ లేఖ రాసింది.

ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పెట్టుబడులకు సిద్ధం పేర్కొంది. అమెజాన్‌ ప్రతిపాదనలను షరతులతో అంగీకరించేందుకు సిద్దమేనని జనవరి 21న ఎఫ్‌ఆర్‌ఎల్‌ రాసిన లేఖకు ప్రతిస్పందన అమెజాన్‌ ప్రతి లేఖ రాసింది. ప్రతిపాదనలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎఫ్‌ఆర్‌ఎల్‌ చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని ఎఫ్‌ఆర్‌ఎల్‌ తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement