ట్విట్టర్‌లో నిర్వహిస్తున్న అనధికారిక స్వతంత్ర వ్యవస్థలు (నకిలీ ఖాతాలు) ఎన్ని ఉన్నాయో, ట్విట్టర్‌లో వాటి శాతం ఎంత అనే విషయంపై బహరింగ చర్చకు రావాలని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలాన్ మస్క్ సవాలు విసిరారు. ట్విట్టర్‌లో 5 శాతం ఖాతాలు నకిలీవేనని ప్రజలకు నిరూపించాలని సవాల్ చేశారు. ట్విట్టర్‌లో నకిలీ యూజర్లు, ఖాతాలు 5 శాతం కన్నా తక్కువగా ఉన్నాయంటారా?అనే విషయంపై ఆయన పోల్ కూడా నిర్వహిస్తున్నారు.
కాగా మస్క్ వాదనలను ట్విట్టర్ కొట్టిపడేసింది. 44 బిలియన్ డాలర్ల ఒప్పందంపై వెనక్కువెళ్లిన మస్క్ వాదనల్లో పస లేదని పేర్కొంది. కాగా ట్విట్టర్‌లోని 100 ఖాతాలను నమూనాగా తీసుకుని పరిశీలిద్దామని, అన్నీ నిజమైన ఖాతాలే అని తేలితే ఒప్పందంలో ముందుకు వెడతామని ఆయన అన్నారు.
- Advertisement -