Tuesday, November 26, 2024

వడ్డీ రేట్ల పెంపు… సరైన సమయంలోనే ఆర్‌బీఐ నిర్ణయం : అశిమ గోయల్‌

న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని, ఇది భారత్‌పై కూడా ప్రభావం చూపుతున్నదని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అశిమ గోయల్‌ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సరైన సమయంలోనే వడ్డీ రేట్లను పెంచిందని గోయల్‌ గుర్తు చేశారు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిగా గురైందని, ప్రస్తుతం మెల్లిగా కోలుకుంటోందన్నారు. తాజాగా నెలకొన్న భౌగోళికపరమైన అంశాలు, ఉద్రిక్త పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి ఆలస్యం చేయలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులపై అతిగా స్పందించడం కూడా సరైన విధానం కాదన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా.. పెరిగిన ఆహార, చమురు ధరల పెరుగుదలతో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాను దాటిందన్నారు.

శాజనకంగా వ్యాపారాలు

దేశంలో వ్యాపారాలు, వేతనాలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయని గోయల్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్ల పెంపు ఉంటుందని చెప్పారు. లేదంటే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమాన అంశాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎంపీసీ పరిగణలోకి తీసుకునే ద్రవ్యోల్బణ అంచనాలు ప్రస్తుతానికి ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యాల పరిధిలోనే ఉన్నాయన్నారు. కరోనా సంక్షోభం నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోలేదని వివరించారు. మళ్లి కరోనా కేసులు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని హెచ్చరించారు. ఈ విషయంపై అతిగా ఆందోళన వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ట కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్‌ ్వ బ్యాంకు ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement