Saturday, November 23, 2024

ప్రారంభమైన డిజిటల్‌ రూపీ

ఆర్బీఐ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన డిజిటల్‌ రూపీ మంగళవారం నుంచి వినియోగంలోకి వచ్చింది. ఎంపిక చేసిన బ్యాంక్‌లు ఇ-రూపీని వినియోగించాయని ఆర్బీఐ తెలిపింది. సెకండరీ మార్కెట్‌ లావాదీవీల్లో ఇ-రూపీని అనుమతించారు. మొదటి రోజు బ్యాంక్‌లు ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో 275 కోట్ల లావాదేవీలు నిర్వహించాయి. 9 బ్యాంక్‌లు 1.4 బిలియన్‌ రూపాయల విలువైన 24 ట్రేడ్స్‌ను 2027 బాండ్స్‌లో నిర్వహించాయని క్లీయరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డేటా పేర్కొంది. 2032 బాండ్స్‌లో 23 ట్రేడ్స్‌ను 1.3 బిలియన్‌ రూపాయాల లావాదేవీలు నిర్వహించాయి.

మరో నెల రోజుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రిటైల్‌ లావాదేవీల్లోనూ డిజిటల్‌ రూపాయిని వినియోగించనున్నారు. ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీకి వ్యతిరేకంగా పోరాడేందుకే ప్రభుత్వం ఇ-రూపీని తీసుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement