ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. జూలై 22 నుంచి మాస్టర్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల నుంచి కొత్తగా భారతీయ కస్టమర్లను ఎవరినీ చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశించింది. కొత్త డొమెస్టిక్ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్ల కార్డులు మూడింటికి ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.
పేమెంట్స్ సిస్టమ్ డేటాకు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించిందని ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం మాస్టర్‌కార్డ్ యథాతథంగా తమ సర్వీసులను కొనసాగించవచ్చని పేర్కొంది. పేమెంట్ వ్యవస్థల డేటాను పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను ఆర్‌బీఐ 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు 6 నెలల గడువు విధించింది. మాస్టర్ కార్డ్ ఇప్పటికీ ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయలేదు. దాంతో ఆర్బీఐ మాస్టర్ కార్డుపై ఆంక్షలు విధించింది. మూడు నెలల క్రితమే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయి. ఈ సంస్థల కొత్త కార్డుల జారీపై కూడా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.
ఈ వార్త కూడా చదవండి: వాట్సాప్ సందేశాల ఆధారంగా తీర్పు చెప్పలేమన్న సుప్రీంకోర్టు