Friday, November 22, 2024

రూ.2వేల నోట్ల చలామణీ తగ్గిస్తున్న ఆర్బీఐ..

న్యూఢిల్లీ: బ్లాక్‌మనీని అరికట్టడంలో భాగంగా కేంద్రం 2016 నవంబర్‌ 8న రూ.500, రూ.1000నోట్లను రద్దుచేసింది. అనంతరం రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రూ.500, రూ.200 నోట్లను కేంద్ర ప్రభుతం చలామణీలోకి తీసుకువచ్చింది. దాదాపు ఐదేళ్ల తరాత ఆర్బీఐ రూ.2వేల నోట్లను క్రమంగా చలామణీ తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా గత రెండేళ్లుగా రిజర్వుబ్యాంక్‌ రూ.2వేల నోట్ల ముద్రణను ఆపేసింది.

2018 మార్చి 31నాటికి దేశంలో 336.3కోట్ల రూ.2వేల నోట్లు చలామణీలో ఉండగా ఈ ఏడాది నవంబర్‌ నాటికి వాటి సంఖ్య 223.3కోట్లకు తగ్గింది. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో వీటి శాతం 3.27శాతం నుంచి 1.75శాతానికి తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చదరీ రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. నగదు లావాదేవీల డిమాండ్‌కు అనుగుణంగా కరెన్సీని చలామణీలో ఉంచేందుకు రిజర్వుబ్యాంక్‌ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పంకజ్‌ చదరీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement