Wednesday, October 9, 2024

RBI Interest Rates : ఈసారీ వడ్డీరేటు పెరగదా…

ముంబయి: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సోమవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ ఇవాళ‌ ప్రకటించారు. రెపో రేటును 6.5శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది. ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆర్బీఐకి ఇది 10వ సారి. అయితే, ప్రస్తుత పరిణామాల ప్రకారం రెపో రేటు తగ్గింపు డిసెంబర్ లో జరిగే సమావేశంలో ఉండొచ్చని సమాచారం.

ప్రస్తుతం ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 6.5శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఓటు వేసినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ వెల్లడించిన రేట్లు గుడ్ రిటర్న్ నిర్వహించిన పోల్ కి అనుకూలంగా ఉన్నాయి. అటు ద్రవ్యోల్బణంతో పాటు ఇటు వృద్ధి రేటును బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈసారి కూడా రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ముందుకు వెళ్లింది.

ఈ క్రమంలో ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా, అసమానంగా ఉంటుందని శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. అలాగే, ప్రభుత్వ వినియోగం మెరుగుపడుతోందని ఆయ‌న‌ తెలిపారు. మెుదటి త్రైమాసికంలో 8 ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి 1.8 శాతం తగ్గిందని.. FY25 మెుదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండవ త్రైమాసికంలో 7 శాతం, మూడవ త్రైమాసికంలో 7.4 శాతం, నాల్గవ త్రైమాసికంలో 7.4 శాతం వద్ద ఉంటుందని ఆయన అంచనా వేశారు.

- Advertisement -

ఇదే క్రమంలో FY 26 మెుదటి త్రైమాసికంలో వృద్ధిని 7.3 శాతం ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. అంతర్జాతీయంగా, దేశీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని మూడవ త్రైమాసికంలో ఇది స్వల్పంగా పెరిగి 4.8 శాతంగా ఉండవచ్చన్నారు. ఇక, నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గి 4.2 శాతానికి చేరుకుంటుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement