Tuesday, November 26, 2024

RBI | మూడు బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమాన..

రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝళిపించింది. సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లపై రూ.10.34 కోట్ల జరిమాన విధించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ నిబంధనలు పాటించని కారణంగా సిటీ గ్రూప్‌పై గరిష్టంగా రూ.5 కోట్ల జరిమానా విధించింది.

“సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ లార్జ్ కామన్ ఎక్స్‌పోజర్స్ అండ్ అదర్స్” నిబంధనలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.4.34 కోట్ల జరిమానా విధించినట్లు తెలిసింది.

మరో ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ. ఆర్బీఐ రూ. రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు బ్యాంకులకు జరిమానా కూడా విధించినట్లు తెలిపింది.

- Advertisement -

రుణాలు, అడ్వాన్సుల మంజూరులో నిబంధనలు, మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించినందుకు ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్’పై ఆర్బీఐ రూ.1 కోటి జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ మూడు బ్యాంకులకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement