Saturday, November 23, 2024

నవంబర్​ 1 నుంచే ఆర్బీఐ ఇ-రూపీ.. ప్రయోగాత్మకంగా అమలుకు నిర్ణయం

ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లకు జతగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నవంబర్‌ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్‌ రూపాయిను ప్రారంభించ నుంది. టోకు అవసరాలకు వినియోగించే డిజిటల్‌ రూపాయి (ఇ-రూపీ)ని మొదట ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలకు ఇ-రూపీని వినియోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లు ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాయని ఆర్బీఐ తెలిపింది. రిటైల్‌ అవసరాలకు సంబంధించిన డిజిటల్‌ రూపాయిని కూడా నెల రోజుల్లో ప్రారంభిస్తామని ఆర్బీఐ వెల్లడించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో వ్యాపారులు, వినియోగదారుల మధ్య ఈ లావాదేవీలు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)గా దీన్ని వ్యవహరించనున్నారు. ఇ-రూపీపై ఆర్బీఐ కాన్సెప్ట్‌ నోట్‌ను విడుదల చేసింది. సీబీడీసీలో ఒకటి సాధారణ లేదా రిటైల్‌ అవసరాలకు( సీబీడీసీ-ఆర్‌) వినియోగించేంది కాగా, మరొకటి టోకు అవసరాలకు (సీబీడీసీ-డబ్ల్యూ) వినియోగించేలా వర్గీకరించారు. రిటైల్‌ సీబీడీసీని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సీబీడీసీని ఎంపిక చేసిన ఆర్ధిక సంస్థలు మాత్రమే వనిఇయోగించడానికి వీలుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement