ఇండిన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 57.50 లక్షల జరిమానా విధించింది. మార్గదర్శకాలను పాటించకపోవడం, నివేదికలు పంపించడంలో నిర్లక్ష్యానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏటీఎం కార్డు క్లోనింగ్‌తో జరిగిన మోసం గురించి మూడు వారాల్లోగా ఆర్బీఐ దృష్టికి తీసుకు రావడంలో బ్యాంక్ విఫలమైంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలకు ప్లోటింగ్ వడ్డీ రేట్లు అమలులోనూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విఫలౖమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.