కీలక విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏటా తప్పనిసరిగా సెలవులపై పంపించాలంటూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులను ఆదేశించింది. పది రోజులకు తక్కువ కాకుండా వారికి సెలవులు మంజూరు చేయాలని, ఈ విషయంలో ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా ముందస్తు సెలవులపై ఎటువంటి సమాచారం వారికి ఇవ్వకూడదని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. సవరించిన రిస్క్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల్లో భాగంగా ఆర్‌బీఐ శుక్రవారం నాడు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. సెలవులో ఉన్న వారికి ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందకుండా చూడాలని కూడా ఆర్‌బీఐ తెలిపింది. అయితే..బ్యాంకుల అంతర్గత వ్యవహారాలు, ఇతర కార్పొరేట్ ఈ-మెయిళ్లకు మటుకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: జనాభా తగ్గించేందుకు కొత్త విధానం