ప్రముఖ టెక్స్టైల్ వ్యాపార సంస్థ రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడిభాగాల బిజినెస్‌లోకి ప్రవేశించనుంది. మైని ప్రెసిషన్ ప్రొడక్ట్ లిమిటెడ్‌లో 59.25 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా రేమండ్ ఈ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఈ వాటాను 682 కోట్లతో వాటాను కొనుగోలు చేయనుంది. కొంత రుణం, మరికొంత సొంత నిధులను ఇందుకోసం వినియోగించనుంది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో లావాదేవీని పూర్తి చేయనున్నట్ల రేమండ్ గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీకి సమాచారం ఇచ్చింది. ఎంపీపీఎల్లో వాటాల కొనుగోలు ద్వారా రేమండ్ గ్రూప్‌కు ఉన్న ఇంజినీరింగ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని రేమండ్ గ్రూప్ భావిస్తోంది. రేమండ్ గ్రూప్‌నకు చెందిన జేకే ఫ్లియిస్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రింగ్ ప్లస్ ఆక్వా లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు పూర్తి చేయనుంది.
కొనుగోలు పూర్తయ్యాక జేకే ఫైల్స్, ఆర్పీఏఎల్, ఎంపీపీఎల్ ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చి కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని రేమండ్ గ్రూప్ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీకి ఎంపీపీఎల్ వ్యవస్థాపకుడు గౌతమ్ మైనీ ముందుండి నడిపించనున్నారు.
ఈ కొనుగోలు ద్వారా తమ ఇంజినీరింగ్ బిజినెస్ బలోపేతం అవుతుందని, వేగంగా వృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ డిఫెన్స్, ఈవీ వంటి వ్యాపార విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందని రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హరి సింఘానియా చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ వ్యూయల్ ఇంజక్షన్, ట్రాన్స్మిషన్, ఈవీ కాంపోనెంట్స్, హైడ్రాలిక్స్ వంటి 11 వ్యాపారాలు ఎంపీపీఎల్‌కు ఉన్నాయి. ఈ కొనుగోలు ఒప్పందానికి నియంత్రణ సంస్థలు ఆమోదం తెలపాల్సి ఉంది.