Tuesday, November 19, 2024

పాలసీ రేట్ల పెంపు, దేశ వ్యతిరేకం కాదు.. ద్రవ్యోల్బణం కట్టడికి కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉందని, పాలసీ రేట్లు పెంచాలనే డిమాండ్‌ కూడా పెరుగుతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఆర్‌బీఐ ఎప్పుడో ఒకప్పుడు రెట్లు పెంచాల్సి ఉంటుందన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు.. పాలసీ రేట్లను పెంచడం దేశ వ్యతిరేక చర్య కాదని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి పెట్టుబడి అని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు ఆయన సూచించారు. ద్రవ్యోల్బణంపై యుద్ధం ఎప్పటికీ ముగియదని, నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశీయ వృద్ధికి మద్దతుగా విధాన రేట్లపై ఆర్‌బీఐ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అంచనాను.. 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణానికి ప్రాధాన్యత ఇస్తూ.. వృద్ధి అంచనాను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది.

ఆ అంశాలు దేశ వ్యతిరేకం కావు..

విదేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే అంశాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలు కావని, ఆర్థిక స్థిరతం కోసం పెట్టుబడి అని అర్థం చేసుకోవాలని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను ఉద్దేశిస్తూ రఘురాం రాజన్‌ అన్నారు. ఈ పెట్టుబడుల ఫలితంగా ప్రతీ భారతీయుడు గొప్ప లబ్దిదారుడిగా నిలుస్తాడని వివరించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పని చేసిన సమయంలోని (సెప్టెంబర్‌ 2013 నుంచి సెప్టెంబర్‌ 2016) ఓ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పుడు భారతదేశం పూర్తి స్థాయి కరెన్సీ సంక్షోభాన్ని కలిగి ఉందని, ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకుందని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపోరేటును 2013 సెప్టెంబర్‌లో 7.25 నుంచి 8 శాతానికి పెంచిందని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గినందున తాము రెపో రేటును 150 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.5 శాతానికి చేర్చామన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థీరకరించడానికి వృద్ధికి ఊతం ఇచ్చారని, ఇది 2013 జూన్‌-ఆగస్టులో 5.91 శాతం నుంచి 2016 జూన్‌-ఆగస్టు 9.31 శాతానికి చేరుకుందని రాజన్‌ తెలిపారు. ఇది భారతదేశ ఫారెక్స్‌ నిలను కూడా మెరుగుపర్చిందని, కానీ అవన్నీ ఆర్‌బీఐ చేస్తున్నపని కాదని అంగీకరించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement