భారతీయ రైల్వేలు 2023-24ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 787.58 మిలియన్ టన్నుల బొగ్గును రవాణాచేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రూ.86,838.35 కోట్ల ఆదాయం సమకూరింది. రైల్వేల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జూన్‌లో మొత్తం 135.46 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో కొనసాగింది.
ఇది గతేడాది ఇదే నెలలో ఉన్న 123.06 మిలియన్ టన్నులతో పోలిస్తే 10.07 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ మొత్తం సరుకు రవాణాలో దేశీయ బొగ్గు 60.27 మిలియన్ టన్నులు కాగా, దిగుమతి చేసుకున్న బొగ్గు 8.82 మిలియన్ టన్నులు. భారతీయ రైల్వేలు గత సంవత్సరంతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13.8 శాతం పెరుగుదలతో ట్రాక్ పునరుద్ధరణలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.
మెరుగైన సామర్థ్యం, భద్రతకు దోహదపడింది అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2022-2023లో రైల్వేలు 5,227 ట్రాక్ కిలోమీటర్లను పునరుద్ధరించాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 5,950 కి.మీకి చేరిందని సదరు ప్రకటన వెల్లడించింది.