రైల్‌వైర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా ప్రీ-పెయిడ్ వై-ఫై ను కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. రైల్‌వైర్ ఎఫ్‌టీటీహెచ్ (ఫైబర్ టూ హోం) ద్వారా తీసుకున్న ఇంటి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రైల్‌టెల్ వై-ఫై నెట్‌వర్క్‌కు కూడా ఉపయోగించుకోవచ్చుని రైల్‌టెల్ తెలిపింది.
6,105 రైల్వే స్టేషన్లలో…
దేశవ్యాప్తంగా 6,105 రైల్వే స్టెషన్లలో ఉన్న రైల్‌టెల్ వై-ఫై సదుపాయాన్ని వినియోగాదారులు ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫైని ఆన్‌చేసి రైల్‌వైర్ ఎస్‌ఎస్‌ఐడీని ఎంపిక చేసుకోవాలి. తరువాత రైల్‌వైర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కో సం లాగిన్ స్క్రీన్‌పైన ఇచ్చిన హైపర్ లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. రైల్‌టెల్ వై-ఫై దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉంది. అంతర్జాతీయంగా అతి పెద్ద అనుసంధానిత పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ ఇదీ ఒకటి.
ఈ నెట్‌వర్క్‌ను రోజు పది లక్షల మందికిపైగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్‌వైర్‌కు 4.82 లక్ష మంది చందాదార్లు ఉన్నారు. ఓటీటీతో కూడిన రైల్‌వైర్ బ్రాడ్ బాండ్ పధకం నెలకు 499 రూపాయలతో ప్రారంభం అవుతుంది. దీని ద్వారా 14 ఓటీటీ సేవలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా అత్యంత చౌక పథకాల్లో ఇది ఒకటి. రైల్‌వైర్ ఇంటర్నెట్ సదుపాయం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఉంది. దీనికి 50 శాతానికిపైగా చందారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.