Saturday, November 23, 2024

క్యుఈ కాంక్లేవ్ వద్ద క్యుమెంటిస్ఏఐ ని విడుదల చేసిన క్వాలిజీల్

హైద‌రాబాద్, (ఆంధ్రప్రభ) : క్వాలిటీ ఇంజినీరింగ్ (క్యుఈ)లో గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్న క్వాలిజీల్, ఇటీవల క్యుఈ కాంక్లేవ్ 2024 రెండ‌వ ఎడిషన్‌ను నిర్వహించింది. ఏఐ – శక్తితో కూడిన క్వాలిటీ ఇంజనీరింగ్ టూల్ క్యుమెంటిస్ఏఐ ని కూడా ఆవిష్కరించింది.

ఏఐ – పవర్డ్ క్వాలిటీ ఇంజినీరింగ్: విజన్ ఫర్ 2025 అండ్ అంతకు మించి అనే నేపథ్యంతో నిర్వహించిన ఈ సదస్సు క్యుఈ భవిష్యత్తును రూపొందించే పరివర్తన ధోరణులను చర్చించడానికి 600 ప్ల‌స్ మంది పరిశ్రమల నాయకులు, మధ్య నుండి సీనియర్ స్థాయి నిపుణులు, ఆలోచనా నాయకులను ఒకచోట చేర్చింది.

క్వాలిజీల్ కో-ఫౌండర్ అండ్ హెడ్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్ మధు మూర్తి రోనాంకి ఈ సదస్సు లో క్యుమెంటిస్ఏఐ ను విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ గురించి శ్రీ రోనాంకి మాట్లాడుతూ… క్యుమెంటిస్ఏఐ కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదు, అత్యాధునిక ఏఐ సామర్థ్యాలతో సంక్లిష్టమైన, నాణ్యమైన ఇంజినీరింగ్ ప్రక్రియలను సులభతరం చేయడం ఒక లక్ష్యమ‌న్నారు.

టెస్టింగ్ లైఫ్‌సైకిల్‌లోని ప్రతి దశలోనూ జెన్ ఏఐని మిళితం చేయటం ద్వారా, తాము వ్యాపారాలకు ఆవిష్కరణలను వేగవంతం చేయడం, సామర్థ్యాన్ని మెరుగు పరచడం, సాటిలేని ఫలితాలను సాధించడంలో సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంపై శ్రీ సింగ్ మాట్లాడుతూ.. క్యుఈ కాన్‌క్లేవ్ 2024లో పాల్గొనడం ఒక అద్వితీయ అనుభవమ‌న్నారు. పరిశ్రమ నాయకులు, నిపుణులు, ఆవిష్కర్తల పెద్ద, ఉత్సాహభరితమైన బృందం పాల్గొనటం, భారతదేశంలో నాణ్యమైన ఇంజనీరింగ్ ల్యాండ్‌స్కేప్‌లో పెరుగుతున్న వేగాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా నిర్వచించబడిన యుగాన్ని అధిగమిస్తున్న వేళ, పరిశ్రమల అంతటా సామర్థ్యం, శ్రేష్ఠత నడపటంలో క్వాలిటీ ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement