Wednesday, September 25, 2024

QS Global list 2025 – హైదారాబాద్ ఐఎస్‌బీ కు టాప్ 100 లో చోటు

ఢీల్లీ: భారత్‌లోని పలు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రపంచ స్థాయిలో మరోసారి ప్రాముఖ్యతను చాటుకున్నాయి. క్యూఎస్‌ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ ర్యాంకింగ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

టాప్‌ 100 బిజినెస్‌ స్కూళ్ల జాబితాలో మన దేశంలోని ఐఐఎం- బెంగళూరు, ఐఐఎం- అహ్మదాబాద్‌, ఐఐఎం -కలకత్తాలతో పాటు ఐఎస్‌బీ హైదరాబాద్‌ ఉండటం విశేషం.

మూడు ఐఐఎంలు ఉపాధికి సంబంధించి టాప్‌ 50లో స్థానం దక్కించుకున్నాయి.

- Advertisement -

క్యూఎస్‌ గ్లోబల్‌ లిస్ట్‌లో మూడు కొత్త ఎంట్రీలతో పాటు మొత్తంగా 14 ఫుల్‌టైం ఎంబీఏ ప్రోగ్రామ్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ కూడా వరుసగా ఐదోసారి అగ్రస్థానంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్‌ కోర్సులను అందించే ప్రముఖ స్కూళ్లలో ఉపాధి అవకాశాలు, తదితర కీలక అంశాలను పరిశీలించి, విశ్లేషించి క్యూఎస్‌ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ ఈ జాబితాను రూపొందిస్తుంటుంది.

ఇదిలా ఉండగా.. ఐఐఎం- కొయ్‌కోడ్‌ 151-200 మధ్య ఉండగా.. ఐఐఎం- ఘజియాబాద్‌, సోమయ్య విద్యావిహార్‌ విశ్వవిద్యాలయం 251+లో చోటు దక్కించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement