Friday, September 20, 2024

HYD: అమ్మ శరన్నవరాత్రోత్సవాల్లో గ్రంథాలయాలకు, వేద పాఠశాలలకు ‘పురాణపండ’ మంత్ర పేటికలు

హైదరాబాద్ : గంభీరంగా, గహనంగా, గూఢంగా ఉండే పరమరహస్యమైన పరమాత్మ పరతత్వాన్ని సరళమైన రమణీయ వ్యాఖ్యానాలతో, కథలతో అనేక అద్భుత గ్రంధాలుగా అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పరమ పవిత్ర సంకల్పాలతో దూసుకుపోతున్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలైన ప్రణవనాదాల్లాంటి నాలుగు అద్భుత గ్రంధాలతో ప్రముఖ ఆధ్యాత్మిక ధార్మిక గ్రంధాల ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ‘ ఆర్ష వాజ్మయ ప్రచారభేరిని మ్రోగించబోతోంది.

ఇప్పటికే భక్తిమయంగా సంచలనం సృష్టించిన ‘శ్రీమాలిక’ , ‘ఉగ్రం … వీరం’, ‘శంకర … శంకర’ , ‘గణానాం త్వా’ పేరిట లక్షలమంది భక్త రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ అమోఘ గ్రంధాలు నాల్గింటినీ ఉచితంగా అందించబోతోంది జ్ఞానమహాయజ్ఞ కేంద్రం. ఈ నాలుగు గ్రంధాలలో మొదటి గ్రంధమైన ‘శ్రీమాలిక’ ను కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామిజీ ఆవిష్కరించి శ్రీనివాస్ పై మంగళాశాసనం వర్షించగా… , రెండవగ్రంధం ‘ఉగ్రం … వీరం’ గ్రంధాన్నిఆవిష్కరించిన విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పురాణపండ నృసింహావిర్భావ ఘట్టంలోని శబ్దసౌందర్యం కనులముందు ప్రహ్లాద నారసింహుల ఘట్టాల్ని ఆవిష్కరింపచేసి వొళ్ళు గగుర్పొడిచేలా చేసిందని శ్రీనివాస్ పై అభినందనలు వర్షించడం విశేషం.

శ్రీశైల, శ్రీకాళహస్తి, కపిలతీర్థ, అరుణాచల క్షేత్రమువంటి అనేక శైవ క్షేత్రాలలో ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగపడేలా పరమ శివ కటాక్షంగా అందించిన ‘శంకర.. శంకర’ రమణీయ గ్రంధాన్ని నాడే ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ… ఈ మహా సాధనల కార్యం మామూలు విషయంకాదని శ్రీనివాస్ కి ఉన్న దైవబలాన్ని గుర్తుచేశారు.

- Advertisement -

గత వారం రామకృష్ణమఠాధిపతులు స్వామి జ్ఞానదానంద ఆవిష్కరించిన విఘ్నేశ్వరుని విశేష వైభవ సంచిక ‘గణానాం త్వా’ అపురూప గ్రంథంలోని గాణాపత్య అంశాలు అరుదైనవనీ, దైవబలం, ఉపాసనాబలం, నిస్వార్ధత వల్లనే శ్రీనివాస్ ఈ అపురూపాలు ఇంత మంత్రాత్మకంగా, అద్భుతంగా రాజీ పడకుండా అంకితభావంతో అందించగలుగుతున్నారనీ ప్రశంసించడం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి.

ఈ నాలుగు గ్రంధాలను ఒకే ఫైల్ లో పెట్టి మరీ గ్రంధరాజాల విలువను తెలుపుతూ అపురూపంగా అందిస్తోంది హైదరాబాద్ కు చెందిన బీ ఎస్ సి పీ ఎల్ సంస్థ. ఇప్పటికే అమరావతి, బెజవాడలలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతోద్యోగులకు ఈ మార్వలెస్ ఫైల్ ద్వారా ఈ నాలుగు భక్తిరసభరిత గ్రంధాలను అందించిన బీ ఎస్ సి పీ ఎల్ ఇన్ఫ్రా సంస్థ ఇప్పుడు వైదిక వైఖానస అద్వైత మాధవ శ్రీ వైష్ణవ ఉదాత్త విలువల ఆలయాల అనుగ్రహంతో క్రొత్త తరానికి ఇవి అందించాలని ఈ మహోత్తమ కార్యానికి శ్రీకారం చుట్టింది.

తెలుగు రాష్ట్రాలలోని వేద పాఠశాలలకు, ప్రధాన గ్రంథాలయాలకు, అర్చక వేద పండితులకు, ఆలయాలకు పురాణపండ రచనా సంకలనాలైన ఈ నాలుగు అపూర్వ ఆర్ష భారతీయ గ్రంధాలను ఉచితంగా అందించనున్నట్లు బీ ఎస్ సి పీ ఎల్ ఇన్ఫ్రా సంస్థ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అత్యంత ఆత్మీయులైన కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, తెలంగాణా రాష్ట్ర బీఆరెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జె జె హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ జయంతీరెడ్డి, జయరామిరెడ్డి, కల్కి చలన చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్, ఒమేగా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా ధనంజయల‌ సౌజన్యంతో ఈ గ్రంథ వైభవాలను జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సమర్పిస్తోంది.

తిరుమల మహాక్షేత్ర ఆగమసలహాదారులైన పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మొదలు యాదాద్రి ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వరకూ శ్రీనివాస్ మంత్ర వైభవాల దైవీయ వైభోగాలను ప్రశంసించినవారేనని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దైవబలాల మహాబలంతోనే ఇంత నిస్వార్ధంగా, ఇంత అద్భుతంగా ఒక మహా యజ్ఞకార్యంగా ఈ ధార్మిక గ్రంథ సేవ చేస్తున్నారని అనేక ఆలయాల ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారులు, పండితవర్గాలు బాహాటంగా చెబుతున్నారు. రాబోయే దసరా సారన్నవరాత్రోత్సవాల, తిరుమల బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భంలో ఈ మంగళమయ గ్రంధాల వితరణకు జ్ఞానమహాయజ్ఞ కేంద్రం శ్రీకారం చుడుతోందని సంస్థ ప్రతినిధి ప్రకటించారు.

దశాబ్దాలుగా అద్భుత అనిర్వచనీయ రసవత్ఘట్టాల్లాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి మహామహులచే శభాష్ అనిపించుకున్న ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళారాధన సంస్థాపకులు సంజయ్ కిషోర్ కి ఆదివారం మధ్యాహ్నం విఖ్యాత వైద్య సేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక, నృసింహ గ్రంధాలు రెండింటిని బహూకరించారు. ఈ శ్రీకార్యానికి ప్రోత్సాహ వాత్సల్యాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారులు , సీనియర్ ఐఏఎస్ అధికారి కె. వి. రమణాచారికి పురాణపండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement