Thursday, November 21, 2024

మార్కెట్లోకి పుమా షాపింగ్‌ యాప్‌.. భారత్‌లోనే తొలిసారి..

జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పుమా మన దేశంలో మొబైల్‌ షాపింగ్‌ యాప్‌ను ప్రారంభించింది. పుమా బ్రాండ్‌ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో పుమా మన దేశంలో 2,044 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2020తో పోల్చితే ఇది 68.2 శాతం అధికం. గత సంవత్సరం పుమా భారత్‌లో 51 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 450కి చేరింది.

భారత్‌ తమకు ఎంతో ముఖ్యమైన మార్కెట్‌ అని, సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు సిబ్బంది ఎంతో కృషి చేశారని కంపెనీ సీఈవో జోర్న్‌ గుల్డెన్‌ తెలిపారు. కొత్త యాప్‌ ద్వారా వినియో గదారులు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయ వచ్చని చెప్పారు. ఇందులో వర్చువల్‌ ట్రయల్‌, 3డీ యానిమేషన్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement