Tuesday, November 26, 2024

తెలంగాణ‌లో విజయ డెయిరీకి లాభాలు.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విజయ డైరీ లాభాలబాట పట్టిందని రాష్ట్ర పాడి,పశుగణాభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో విజయ డైరీ టర్నోవర్‌ నేడు రూ.700 కోట్లకు చేరిందన్నారు. తెలంగాణ స్టేట్‌ డైరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన సోమా భరత్‌ కుమార్‌ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

భరత్‌ కుమార్‌ను మంత్రి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… విజయ డైరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాధరణ ఉన్నా నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులోకి తేలదని విమర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విజయ డైరీ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. విజయ డైరీ అభివృద్ధి చర్యల్లో భాగంగా 250 కోట్ల రూపాయలతో మెగా డరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement