ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ టాటా కన్జ్యూమర్ పొడక్ట్స్ (టీసీపీఎల్) ప్రూట్ జ్యూస్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. కంపెనీ అనుబంధ సంస్థ నరిష్‌కో ద్వారా ప్రుస్కీ జ్యూస్ ఎన్ జెలలీ పేరిట పలు ఉత్పత్తులను విడుదల ఏసింది. నరిష్‌కో పోర్టుఫోలియో విస్తరించే లక్ష్యంతోనే తాజాగా ఆల్కహాల్ రహిత పానీయాల విభాగంలోకి ప్రవేశించినట్లు సంస్థ ఎండి విక్రమ్ గ్రోవర్ తెలిపారు.
భారత ప్రూట్ జ్యూస్ మార్కెట్‌లో ఇప్పటికీ సంప్రదాయ పండ్ల రసాలు, అన్ బ్రాండెడ్ జ్యూస్‌లదే ఆధిపత్యం కొనసాగుతుందని ఆయన చెప్పారు. టాటా ప్రుస్కీ బ్రాండ్‌తో మార్కెట్లో విస్తరించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. కాలా ఖట్టా, మిక్స్‌డ్ ప్రూట్ చాట్, లెమన్ పుదీనా అనే మూడు ప్లేవర్లలో జ్యూస్‌లను విడుదల చేసినట్లు తెలిపారు.
తొలుత కోల్‌కతా, ముంబై, గోవా మార్కెట్లలో వీటిని విక్రయించనున్నారు. ఇవి 2 వందల ఎంఎల్ ప్యాక్ ధర 20 రూపాయలుగా నిర్ణయించిటన్లు విక్రమ్ గ్రోవర్ తెలిపారు. తరువాత కాలంలో క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లోనూ టాటా ప్రూట్ జ్యూస్ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లించారు.