Saturday, November 23, 2024

యూకే టెక్‌ రంగంలో ప్రొడాప్ట్‌ పెట్టుబడులు.. 100 మిలియన్‌ యూరోల ఇన్వెస్ట్‌మెంట్‌..

గ్లోబల్‌ కన్సల్టింగ్‌, టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌డ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన ప్రొడాప్ట్‌ తమ పెట్టుబడుల విషయమై కీలక ప్రకటన చేసింది. యూకే మార్కెట్‌లోని టెక్నాలజీ సెక్టార్‌లో రెట్టింపు పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వివరించింది. 100 మిలియన్‌ పౌండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడులతో.. కంపెనీ టెక్నాలజీ రంగంలో మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. 5జీ, క్లౌండ్‌, ఎస్‌డీఎన్‌/ఎన్‌ఎఫ్‌వీ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, ఏఐ/ఎంఎల్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించనున్నట్టు తెలిపింది. యూకే టెలికాం ఆపరేటర్లు, డిజిటల్‌/మల్టి సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (డీ/ఎంఎస్‌పీలు), హై టెక్నాలజీ కంపెనీలు ప్రొడాప్ట్‌ కు కస్టమర్లుగా ఉన్నాయి.

వాణిజ్యపరమైన ఒప్పందాలు.. భారత్‌-యూకే మధ్య మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదం చేస్తాయని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ప్రొడాప్ట్‌ కంపెనీ సీఈఓ, చైర్మన్‌ వేదాంత్‌ జవేర్‌ మాట్లాడుతూ.. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పార్టనర్‌గా ఉండేందుకు ప్రొడాప్ట్‌ ఎప్పుడు ఆసక్తి చూపుతుందని, యూకే టెక్నాలజీ రంగంలో పెడుతున్న 100 మిలియన్‌ యూరోల పెట్టుబడితో.. 500 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే యూకేలో కొత్త ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement