Wednesday, November 13, 2024

మార్చి నాటికి ఐడీబీఐ ప్రయివేటీకరణ పూర్తి.. వెల్ల‌డించిన అధికారులు

ఐడిబిఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు సంబంధించిన ఫైనాన్షియల్‌ బిడ్‌లను మార్చి నాటికి ఆహ్వానించే అవకాశం ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. గత వారం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)తో కలిసి ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను విక్రయించడానికి ప్రాథమిక బిడ్‌లను ఆహ్వానించింది. ఇందుకు చివరి తేదీని డిసెంబర్‌ 16గా నిర్ధారించింది. సాధారణంగా ప్రక్రియ పూర్తి కావడానికి, ఫైనాన్షియల్‌ బిడ్‌లు రావడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. మార్చిలోగా ఐడీబీఐ బ్యాంక్‌ కోసం ఫైనాన్షియల్‌ బిడ్‌లను ఆహ్వానించాలని మేము భావిస్తున్నాము అని అధికారులు వివరించారు. ఐడిబిఐ బ్యాంక్‌ వ్యూహాత్మక విక్రయ ప్రక్రియ సెప్టెంబర్‌ నాటికి ముగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రిజిస్టర్‌ చేయబడిన నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, సెబీ-రిజిస్టర్డ్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌, భారతదేశం వెలుపల విలీనం చేయబడిన ఫండ్‌/పెట్టుబడి వా#హనం బిడ్‌లను సమర్పించడానికి అనుమతించబడతాయి. బిడ్డర్‌ల నికర విలువరూ. 22,500 కోట్లుగా ఉంది. బిడ్‌లు దాఖలు చేసేవాళ్లు గత ఐదేళ్లలో మూడు సంవత్సరాల్లో నికర లాభాన్ని తప్పనిసరిగా నివేదించాలి. అంతేకాకుండా, ఈక్విటీలో 40 శాతం 5 సంవత్సరాల పాటు లాక్‌ చేయబడాలి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉండగా, ప్రభుత్వానికి 45.48 శాతం ఉంది. మిగిలిన 5.2 శాతం వాటా పబ్లిక్‌ వాటాదారుల వద్ద ఉంది.ఈ వ్యూహాత్మక విక్రయం ముగిసిన తర్వాత ప్రభుత్వం 30.48 శాతం వాటాను విక్రయిస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement