ప్రభన్యూస్ : ప్రపంచంలో మూడవ అతి పెద్ద ట్రాక్టర్ తయారీదారు టఫె-ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్‌కు చెందిన ఐషర్ ట్రాక్టర్స్ తమ సరికొత్త ఐషర్ ప్రైమా జీ3 సిరీస్‌ను విడుదల చేసింది. సరికొత్త శైలి, ధృడత్వం కోరుకునే నూతన తరపు భారతీయ రైతుల కోసం తీర్చిదిద్దిన నూతన శ్రేణి ప్రీమియం ట్రాక్టర్లు అని, ఐషర్ ప్రైమా జీ3 ఇప్పుడు 40-60 హెచ్‌పీ శ్రేణిలో నూతన సిరీస్ ట్రాక్టర్లుగా నిలుస్తాయని యాజమాన్యం తెలిపింది. అత్యాధునిక , వినియోగారుల లక్ష్యిత సాంకేతికతతో తీర్చిదిద్దబడిన ఐషర్ ప్రైమా జీ3 శ్రేణి హైటార్క్- ఫ్యూయల్ సేవర్ (హెచ్‌టీ–ఎఫ్‌ఎస్) లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది అత్యుత్తమ సామర్థంను అత్యున్నత ఉత్పాదకత, మరింత అదనపు ఇంధన పొదుపు కోసం అందిస్తుంది.
వ్యవసాయ మరియు వాణిజ్యరంగాలలో నమ్మకం, విశ్వసనీ యత, ధృడత్వం మరియు వైవిధ్యత పరంగా దశాబ్దాలుగా ఐషర్ బ్రాండ్ సుప్రసిద్ధ మైనది. ప్రైమా జీ3 ఆవిష్కరణతో, నవీన భారతంలో అభివృద్ధి చెందుతున్న రైతులకు మరింత ఉత్పాదకత, సౌకర్యం, వారి ఆకాంక్షలకు సరిపోయేలా సౌలభ్యాన్ని అందిస్తుంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..