Thursday, November 21, 2024

ఐడీబీఐపై ప్రేమ్‌ వత్స కన్ను, బ్యాంక్‌ కొనుగోలుకు ప్రయత్నాలు..

హైదరాబాద్‌లో జన్మించి, కెనడాలో స్థిరపడిన పారి శ్రామికవేత్త ప్రేమ్‌ వత్స ఐడీబీఐ బ్యాంక్‌ కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంక్‌లో మెజార్టీ వాటా కొనుగోలు పట్ల ఆయన ఆస క్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నా యి. ప్రేమ్‌ వత్సకు చెందిన పెట్టుబడి సంస్థ ఫెయిర్‌ ఫాక్స్‌ ఇండియా హోల్డింగ్స్‌ ఇప్పటికే ఈ విషయంలో ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపారని తెలుస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. బ్యాంక్‌ ఆర్థికంగా దివాళ తీసిన సందర్భంగా ఎల్‌ఐసీ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ వాటాను దక్కించుకుంది. బ్యాంక్‌లో ఉన్న మొత్తం ప్రభుత్వ వాటాతో పాటు, ఎల్‌ఐసీకి చెందిన కొంత వాటాను కూడా కొనుగోలు చేయాలని వత్స ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమ్‌ వత్సకు వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం, ఎల్‌ఐసీ కూడా సుముఖంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనికి ఆర్బీఐ అమోదం అవసరం అవుతుంది.

ఒప్పందానికి షరతులు..

ఐడీబీఐ బ్యాంక్‌ కొనుగోలు విషయం లో ప్రేమ్‌ వత్స ఆర్థిక శాఖ అధికారుల ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలు స్తుంది. కొనుగోలు తరువాత ఫెయిర్‌ ఫాక్స్‌కు ప్రయోటర్‌ హోదా ఇవ్వాలని, బ్యాంక్‌ కార్యకలా పాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదని, ఒప్పంద తరువాత ఎల్‌ఐసీ కనీసం ఐదేళ్ల పాటు కొనసాగాలని షరతులు పెట్టినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

రెండో కొనుగోలు..

తుది ఒప్పందం కుదిరితే దేశీయ రంగంలో ప్రేమ్‌ వత్సకు ఇది రెండో కొనుగోలు కానుంది. గతంలో 2019 ఫిబ్రవరిలో ఆయన క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒకే సంస్థ రెండు బ్యాంక్‌లకు ప్రయోటర్‌ గా ఉండేందుకు వీలుకాదు. అందు వల్ల ఆర్బీఐ అంగీ కరిస్తే ఐడీబీఐ బ్యాంక్‌లో క్యాథలిక్‌ సిిరియన్‌ బ్యాంక్‌ను విలీనం చేస్తామని ఆయన ప్రతిపాదించినట్లు తెలిసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement