హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ప్రాట్ అండ్ విట్నీ భారతదేశంలో, బెంగళూరులో ఆధునిక ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ (ఐఈసీ)ని స్థాపిస్తున్నట్లు ప్రకటించింది. 2023 జనవరిలో తన కార్యకలాపాలను ఆరంభించనుంది. ఈ కొత్త కేంద్రం కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ సేవలు అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. పూర్తిగా సిబ్బందిని నియామకం చేసిన తరువాత ఐఈసీ 500 ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్ ను నియామకం చేయగలదని ఒక అంచనా.
ప్రాట్ అండ్ విట్ని వారి ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ భారతదేశంలో మా కంపెనీ కోసం మొదటి ఆధునిక పెట్టుబడి అని జియోఫ్ హంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇంజనీరింగ్, ప్రాట్ అండ్ విట్నీ అన్నారు. ఐఈసీ భారతదేశంలో ఇప్పటికే ఉన్న ప్రాట్ అండ్ విట్నీ కార్యకలాపాల సామర్థ్యాలను సమన్వయం చేయడానికి తమకు అనుమతి ఇస్తుందని పాల్ వీడన్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ఇంజనీరింగ్, ప్రాట్ అండ్ విట్నీ కెనడా కార్పొరేషన్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.